కరోనా మూడో దశ ముప్పు నుంచి భారత్ బయటపడినట్టేనా? దీపావళి తర్వాత మూడు వారాలుగా నమోదవుతున్న కరోనా కేసుల సరళిని గమనించి అవుననే చెబుతున్నారు నిపుణులు. కరోనా రెండో దశలో దేశంలో చాలా మంది కరోనా బారినపడటం, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వల్ల మూడో ముప్పు ఉండే అవకాశాలు తక్కువే అంటున్నారు(third wave in india ).
అయితే ఏదైనా కొత్త వేరియంట్ వెలుగు చూస్తే మాత్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరించారు. శీతాకాలం ప్రారంభమైనందు వల్ల కేసులు పెరగొచ్చారు. కానీ రెండో దశలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సూచనలు కనిపించడం లేదన్నారు(corona third wave).
డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్యలో కరోనా కేసులు పెరగొచ్చు. అయితే రెండో దశలో వేలమంది మరణించి, లక్షలాది మంది ఆస్పత్రులపాలైనట్లుగా ఈసారి తీవ్ర ప్రభావం ఉండదు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా కేసుల పెరుగుదల ఉండకపోవచ్చు.
- ప్రొఫెసర్ గౌతమ్ మేనన్, ఆశోకా యూనివర్సిటీ, సోనిపత్.
భారత్లో అక్టోబర్-నవంబర్ మధ్యలో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని కొందరు నిపుణులు అంచనా వేశారు(third wave of corona in india ). దసరా, దీపావళి పండగ సీజన్ల వల్ల ప్రజలు గుమిగూడి కేసులు పెరిగే అవకాశముంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కొత్త కేసులు 543 రోజుల కనిష్ఠానికి చేరి 7,579గా నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా అదే స్థాయిలో పడిపోయాయి. వరుసగా 46 రోజుల పాటు 20వేలకు తక్కువగానే కొత్తగా కేసులు వెలుగు చూశాయి. వరసగా 149 రోజుల పాటు కొత్తగా కొవిడ్ సోకిన వారి సంఖ్య 50వేలకు తక్కువగానే ఉంది(corona third wave news).
కరోనా రెండో దశలో దేశంలో చాలా మంది కరోనా బారినపడటం, ప్రభుత్వం వ్యాక్సిననేషన్ జోరు పెంచడం వల్ల ప్రజలందరికీ కరోనా నుంచి రక్షణ లభిస్తోందని గౌతమ్ మేనన్ అన్నారు. అందుకే ఆస్పత్రులలో చేరేవారు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కరోనా సోకని వారితో పోల్చితే కరోనా సోకిన వారికి వ్యాక్సిన్ వల్ల మరింత ఎక్కువ రక్షణ లభిస్తుందని వివరించారు. వారిలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ వృద్ధి చెందడమే ఇందుకు కారణమన్నారు(third wave news).