తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: బంగాల్​ సీఎం - Mamata latest news

భాజపాపై విమర్శలతో విరుచుకుపడ్డారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపా నాయకులు తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాలని డబ్బులు ఆఫర్‌ చేస్తున్నట్లు విమర్శించారు. తనను అరెస్టు చేసినా పశ్చిమ్​ బంగా‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. జైల్లో ఉండి విజయం సాధిస్తానని మమత అన్నారు.

Even if BJP arrests me- I will ensure TMC victory in polls from jail: Mamata
జైళ్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: మమతా

By

Published : Nov 25, 2020, 8:30 PM IST

తనను అరెస్టు చేసినా బంగాల్​లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. జైల్లో ఉండి విజయం సాధిస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. భాజపా నాయకులు తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాలని డబ్బులు ఆఫర్‌ చేస్తున్నారని విమర్శించారు. బంగాల్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం ఆమె.. బంకురా జిల్లాలో భారీ ర్యాలీని నిర్వహించారు.

"టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు భాజపా వారికి ఆఫర్లు ప్రకటిస్తోంది. కొంత మంది రాష్ట్రంలో కాషాయపార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారు టీఎంసీ నాయకులను భయపెట్టేందుకు నారద(స్టింగ్‌ ఆపరేషన్‌), శారద(కుంభకోణం)లను బయటకు తీస్తారు. కానీ ఈ సందర్భంగా వారికి నేను ఒకటి స్పష్టంగా చెప్పదలచుకున్నా. భాజపాకు గానీ, ఇతర ఏజెన్సీలకు గానీ నేను భయపడేది లేదు. మీకు గనక ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించండి. అయినప్పటికీ నేను జైల్లో నుంచే ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తా."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఇటీవల బిహార్‌లో జరిగిన ఎన్నికలను ఉద్దేశిస్తూ.. 'ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను జైల్లో పెట్టారు. అయినప్పటికీ ఆయన పార్టీ మంచి ఫలితాలనే రాబట్టింది. భాజపా కొన్ని అవకతవకల వల్లే గెలిచింది. కానీ ప్రజాదరణ వల్ల మాత్రం కాదు. కొంతమంది తాము అధికారంలోకి వస్తామనే కలలతో టీఎంసీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అది జరగని పని. ఒకవేళ వారు అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత మేం ఇంకా ఘనమైన విజయంతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటాం' అని మమత అన్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బంగాల్​ పర్యటనలో భాగంగా బంకురా జిల్లాలోని గిరిజన ప్రాంత సందర్శనకు వచ్చి వెళ్లారు.

ఇదీ చూడండి:భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details