తెలంగాణ

telangana

ETV Bharat / bharat

60 మేకలు, వందల కిలోల రైస్​తో అదిరే విందు- మహిళలకు నో ఎంట్రీ!

10 గ్రామాలకు చెందిన 7వేల మంది పురుషులు ఒక్క చోట చేరారు. గరిట పట్టి భారీ మొత్తంలో వంటలు వండుకున్నారు. ఆ తర్వాత మెతుకు కూడా వదలకుండా వంటలను ఆరగించారు. తమిళనాడు మధురైలో జరిగిన ఉత్సవాల్లో ఇదంతా ఓ భాగం. అయితే ఉత్సవాల్లో ఒక్క మహిళకు కూడా అనుమతి లేకపోవడం విశేషం.

Gents Only feast
ఆ ఉత్సవాలు.. పురుషులకు మాత్రమే- వంటలు వండి!

By

Published : Jan 2, 2022, 7:47 PM IST

Updated : Jan 2, 2022, 10:55 PM IST

60 మేకలు, వందల కిలోల రైస్​తో అదిరే విందు- మహిళలకు నో ఎంట్రీ!

తమిళనాడు మధురైలోని కరుప్పయ్య ముత్తయ్య ఆలయంలో ఇటీవల జరిగిన ఉత్సవాలు వార్తల్లో నిలిచాయి. సంప్రదాయంలో భాగంగా.. పురుషులు మాత్రమే ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 60 మేకలతో మటన్​ వండి.. 7వేల మంది తిన్నారు.

గరిట పట్టి.. వంటలు చేస్తూ..
మటన్​ కోసం గరిట పట్టి

అనుప్పపట్టిలోని కరుప్పయ్య ముత్తయ్య ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈసారి జరిగిన వేడుకల్లో 10 గ్రామాల పురుషులు పాల్గొన్నారు. వారే అన్ని పనులు చేసుకున్నారు. పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు వండుకున్నారు. అందరూ కూర్చుని ఆ వంటలను ఆరగించారు.

వేడివేడి అన్నం సిద్ధం
ఉత్సవాల్లో పాల్గొన్న పురుషులు

సంప్రదాయం ప్రకారం.. ఉత్సవాల్లో పాల్గొనకూడదని మహిళలపై నిషేధం ఉన్నట్టు తెలుస్తోంది. పురుషులు తిని పారేసిన అరిటాకులు ఎండిపోయేంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లో మహిళలు రాకూడదని ఓ నియమం అక్కడ ఉండటం విశేషం.

ఈ ఉత్సవాలు.. పురుషులకు మాత్రమే!

ఇదీ చూడండి:-నిమిషానికి 9వేల ఫుడ్‌ ఆర్డర్లు.. 1229 బిర్యానీల డెలివరీ

Last Updated : Jan 2, 2022, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details