తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇకపై మరింత పెద్దగా పొగాకు హెచ్చరికల చిత్రాలు

అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న హెచ్చరికల చిత్రాలను మరింత పెద్దవిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలను పిల్లలు, నిరక్షరాస్యులు సయితం గుర్తించగలిగేలా ఇవి ఉండాలని సూచించింది.

Ensure implementation of new set of health warnings on tobacco products: Centre to states
ఇకపై మరింత పెద్దగా పొగాకు హెచ్చరికల చిత్రాలు

By

Published : Dec 7, 2020, 5:38 AM IST

సిగరెట్‌, గుట్కా, బీడీ ప్యాకెట్లపై కొత్త తరహా హెచ్చరికల నినాదాలు, ఫొటోలు కనిపించనున్నాయి. అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న హెచ్చరికల చిత్రాలను మరింత పెద్దవిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలను పిల్లలు, నిరక్షరాస్యులు సయితం గుర్తించగలిగేలా ఇవి ఉండాలని సూచించింది.

ప్రస్తుతం ప్యాకెట్లపై ఒకే తరహా చిత్రాలను ముద్రిస్తుండగా ప్రతి 12 నెలలకూ వాటిని మారుస్తుండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.

ఇదీ చూడండి: టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన సీరం

ABOUT THE AUTHOR

...view details