Shopian Encounter news: జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమర్చాయి. జైనపొరా ప్రాంతంలోని బాడిగామ్లో ముష్కరులు ఉన్నట్లు గురువారం మధ్యాహ్నం నిఘా వర్గాలకు సమాచారం అందింది. పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముష్కరులు దాగి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని మైక్‌ల ద్వారా కోరారు. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది దీటుగా స్పందించారు. అనేక గంటలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా లష్కరే తొయిబా ఉగ్రమూకకు చెందినవారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- నలుగురు ముష్కరులు హతం - జమ్ముకశ్మీర్ న్యూస్
South Kashmir News: జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు.. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి సైనిక సిబ్బందితో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురి కాగా.. ఇద్దరు జవాన్లు మరణించారు.
కశ్మీర్ ఎన్కౌంటర్
ఇద్దరు జవాన్లు మృతి: షోపియాన్‌లో ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి సైనిక సిబ్బందితో వెళ్తున్న టాటా సుమో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని తొలుత షోపియాన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్ హాస్పిటల్‌కు తరలించారు.
ఇదీ చదవండి:చిన్న ఘర్షణకు ప్రాణాలు బలి.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి
Last Updated : Apr 14, 2022, 6:03 PM IST