ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్- ఆరుగురు మావోయిస్టులు మృతి - బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్
08:59 December 27
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్- ఆరుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
తెలంగాణ గ్రేహౌండ్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్ పెసపాడు అటవీప్రాంతంలో దాడులు జరిగాయని పేర్కొన్నాయి. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వివరించాయి.