electric shock death: మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తగిలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
జిల్లా కేంద్రానికి సమీపంలోని కతోరా ప్రాంతంలో ఉన్న కోటి ఇంజినీరింగ్ కళాశాల ప్రవేశమార్గానికి రంగులు వేస్తున్నారు. పైకి చేరుకునేందుకు ఇనుప రాడ్లతో ఏర్పాటు చేసుకున్న స్టాండు.. పైన ఉన్న హైఓల్టేజ్ విద్యుత్తు తీగలకు తగిలింది. దానిపైనే ఉన్న నలుగురికి విద్యుత్తు ప్రసరణ జరిగి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాద చాయలు అలుముకున్నాయి.