Postal Ballot in Elections 2022: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ ద్వారా గుర్తింపు పొందిన పాత్రికేయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించింది. అంతకుముందు.. 80 ఏళ్లు పైబడివారు, దివ్యాంగులు(40శాతం కంటే ఎక్కువ),కరోనా సోకినవారు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయడానికి ఈసీ ఆమోదం తెలపింది. ఈ జాబితాకు అదనంగా పాత్రికేయులను చేర్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు ఈసీ.
పాత్రికేయులకు ఇక పోస్టల్ బ్యాలెట్.. ఆ ఉద్యోగులకు కూడా... - journalists can cast vote via postal ballot
Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పాత్రికేయులు తమ ఓటును వినియోగించుకునేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ). వారితో పాటు ఎన్నికల జరిగిన రోజు అత్యసవర సేవలు అందించే సిబ్బందికి ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ.
విద్యుత్, బీఎస్ఎన్ఎల్, రైల్వే, పోస్టు, టెలిగ్రామ్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, వైద్య సిబ్బంది, విమానయానం, ఆహార, పౌర సరఫరా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, ఈసీ ద్వారా గుర్తింపు పొంది.. ఎన్నికల రోజు వార్తలు కవరేజీ చేసే మీడియా వ్యక్తులకు ఈ సదావకాశాన్ని వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటుగా ఎన్నికల తేదీల్లో విధులు నిర్వహించే ఇతర అత్యవసర విభాగాల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించింది.
ఇదీ చూడండి:పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా- కొత్త తేదీ ఇదే...