ఉప్పల్ పోరు-గెలుపు వ్యూహాల్లో నిమగ్నమైన ప్రధాన పార్టీలు Election Fight in Uppal Constituency at Ranga Reddy :హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా(Election Fight) తలపడుతున్నాయి. త్రిముఖ పోటీతో పోరాటం రసవరత్తరంగా మారిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని మార్చి బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇటీవల వరకు కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్న బండారి లక్ష్మారెడ్డికి అధికార పార్టీ నుంచి అవకాశం దక్కింది. హస్తం పార్టీ నుంచి పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ తరఫున ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పోటీలో ఉన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం 5,10,187 మంది ఓటర్లు(Voters) ఉండగా.. ఈ స్థానంలో ఏ అభ్యర్థి రెండుసార్లు గెలవరనే ప్రచారముంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఉప్పల్(Uppal) ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే 2లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. సెటిలర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీ గట్టెక్కుతుందని విశ్లేషిస్తున్నారు. రాజస్థాన్‌లో ఈనెల 25న పోలింగ్ ఉన్నందున అక్కడికి వెళ్లినవారు.. మరో ఐదురోజుల్లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేస్తారో లేదోననే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.
తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం - తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్ క్యాంపెయినర్లు
Telangana Election 2023 : బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, తన అన్న రాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధితో పాటు, బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు(BRS Party Schemes) వివరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆరు హామీలను(Congress Six Guarentees) ఓటర్లకు చేరవేస్తున్నారు. టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియన్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖరరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం కొంత ప్రతికూలం. బీజేపీ నుంచి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు :ఉప్పల్ నియోజకవర్గం మూసీ(Musi River) పరివాహకంలో ఉండటం వల్ల స్థానికులకు దోమల బెడద ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 22 చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయని ఫలితంగా వర్షాకాలంలో వరదల భయం వెంటాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాంతపూర్, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో వరద నివారణకు కేటాయించిన రూ.60 కోట్ల పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రామాంతపూర్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, రైతు బజార్ హామీలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సమయం దగ్గరకు వస్తోంది- నాయకుల్లో జోరు పెరిగింది, పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేతలు
ఎన్నికల ప్రచారంలో పూటకో రేటు - డబ్బులివ్వడం ఆలస్యమైతే తగ్గేదేలే అంటున్న కూలీలు