తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జోడు కత్తులు, డాలు'.. ఏక్​నాథ్ శిందే పార్టీ గుర్తు ఖరారు చేసిన ఈసీ - two swords and a shield symbol

ఏక్​నాథ్ శిందే పార్టీ అంధేరీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి.. ఎన్నికల సంఘం 'జోడు కత్తులు, డాలు' గుర్తును కేటాయించింది. శిందే వర్గం మూడు ఐచ్ఛికాలను ఈసీకి పంపగా.. ఈసీ ఈ గుర్తును ఖరారు చేసింది. ఇప్పటికే ఉద్ధవ్​ ఠాక్రే వర్గానికి వెలుగుతున్న కాగడా గుర్తును ఈసీ కేటాయించింది. ఈ కొత్త గుర్తులతో ప్రస్తుతం రెండు పార్టీలు ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నాయి.

ఏక్​నాథ్ శిందే
shinde

By

Published : Oct 11, 2022, 7:57 PM IST

Updated : Oct 11, 2022, 8:19 PM IST

అంధేరీ తూర్పు ఉపఎన్నికలకు గానూ ఏక్‌నాథ్‌ శింథే పార్టీకి 'జోడు కత్తులు, డాలు' గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. పార్టీ గుర్తు కోసం ఏక్‌నాథ్‌ శిందే రావిచెట్టు, ఉదయించే సూర్యుడు, 'జోడు కత్తులు, డాలు' గుర్తులను ప్రతిపాదించి ఎన్నికల సంఘానికి పంపగా.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శిందే పార్టీకి బాలాసాహెబంచీ శివసేన అనే పేరు ఈసీ ఖరారు చేసింది. అటు ఉద్ధవ్‌కు వెలుగుతున్న కాగడా గుర్తును ఇప్పటికే ఈసీ కేటాయించి ఆ పార్టీ పేరును శివసేనా బాలాసాహెబ్‌ ఉద్ధవ్‌ఠాక్రే అని ఖరారు చేసింది. ఈ కొత్త గుర్తులతో ఇరు పక్షాలకు నవంబరు మూడున జరిగే ఎన్నికల్లో పాల్గొననున్నాయి.

.

'శివసేన' పేరు, ఆ పార్టీ గుర్తు అయిన విల్లంబును స్తంభింపచేసింది ఈసీ. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కొత్త పేర్లు, పార్టీకి గుర్తులకు సంబంధించి ఐచ్ఛికాలు సమర్పించాయి. త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం కోరింది. శిందే వర్గం సైతం తమ ఐచ్ఛికాలను సమర్పించినట్లు ఈసీ అధికారులు తెలిపారు. త్రిశూలం, గద, ఉదయిస్తున్న సూర్యుడు ఐచ్ఛికాలను శిందే వర్గం పంపినట్లు సమాచారం. అయితే, ఉదయిస్తున్న సూర్యుడి గుర్తు ఇప్పటికే డీఎంకే పార్టీకి ఉంది. త్రిశూలం, గద మతపరమైన గుర్తులను పోలి ఉన్న నేపథ్యంలో వాటిని ఈసీ పక్కనబెట్టింది. ఈ క్రమంలోనే ఠాక్రే వర్గానికి కాగడా గుర్తు కేటాయించింది. కొత్త గుర్తు కోసం ఐచ్ఛికాలను పంపాలని మరోసారి శిందే వర్గానికి సూచించింది. తాజాగా వారికి 'జోడు కత్తులు, డాలు' గుర్తును ఇచ్చింది.

Last Updated : Oct 11, 2022, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details