తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మరోసారి అధికారంలోకి రావడానికి కారణం అదే!' - కేరళ

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు మరోసారి గెలవడానికి.. ఎన్నికల సంవత్సరంలో ప్రచారాలు సహా ప్రకటనల కోసం డబ్బును ఎక్కువగా ఖర్చుపెట్టడం ఒక ముఖ్య కారణమని ఎస్​బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు. ప్రభుత్వాలు మారడానికి మహిళల ఓటు శాతం పెరగడం, ప్రభుత్వ వ్యతిరేకత, కుల సమీకరణాలు, ప్రస్తుతం ఉన్న నాయకత్వం, తదితర కారణాలున్నాయని వెల్లడించింది. అయితే ఎన్నికల సంవత్సరంలో తక్కువ ప్రచార వ్యయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎక్కువ సందర్భాల్లో ఓడిపోయాయని తెలిపింది.

mamata, vijayan
మమత, విజయన్

By

Published : May 14, 2021, 10:50 PM IST

Updated : May 14, 2021, 11:41 PM IST

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు.. వరుసగా మరోసారి అధికారంలోకి రావడానికి ప్రచారాల కోసం భారీగా ఖర్చు చేయడం ఒక ముఖ్య కారణమని ఎస్​బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు. మమతా బెనర్జీ సీఎంగా ఉన్న బంగాల్​, పినరయి విజయన్​ సీఎంగా ఉన్న కేరళలో అధికార ప్రభుత్వాలే.. తిరిగి నెగ్గడానికి అదే దోహదపడిందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఓ నివేదికను రూపొందించారు.

కేరళ 47 శాతం, బంగాల్​ 8 శాతం..

కేరళలో వామపక్ష ప్రభుత్వం.. క్రితం సారి కంటే ఈ ఎన్నికల సంవత్సరంలో 47 శాతం ప్రచారం కోసం ఎక్కువగా ఖర్చు చేసిందని ఎస్​బీఐ వెల్లడించింది. బంగాల్​లో ఇది 8 శాతం ఎక్కువ అని అంచనా వేసింది.

ఇవే కాకుండా మార్కెటింగ్​, సమాచారం సేకరణ తదితర రూపేణా డబ్బులు ఖర్చుపెట్టడం కారణమని తెలిపింది. అయితే ఎన్నికల సంవత్సరంలో ప్రచారం కోసం తక్కువ డబ్బు ఖర్చుపెట్టిన ప్రభుత్వాలు ఎక్కువ సందర్భాల్లో ఓడిపోయాయని పేర్కొంది.

'అవి అంతగా ప్రభావం చూపవు'

ఆయా పార్టీ ప్రభుత్వాలు సమర్పించిన బడ్జెట్ పత్రాల ఆధారంగా తాము వెల్లడిస్తున్నామని ఎస్​బీఐ తెలిపింది. అయితే వరుసగా మరోసారి అధికారంలోకి రావడానికి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం, ఓటింగ్​ శాతం పెరగడం, ప్రభుత్వ పథకాలు కూడా కారణం అని.. కానీ అవి అంతగా ప్రభావం చూపలేకపోతాయని పేర్కొంది.

'ప్రభుత్వం మారడానికి మహిళలే కీలకం'

ప్రభుత్వాలు మారడానికి మహిళల ఓటు శాతం పెరగడం, ప్రభుత్వ వ్యతిరేకత, కుల సమీకరణలు, ప్రస్తుతం ఉన్న నాయకత్వం, తదితర కారణాలున్నాయని వెల్లడించింది. తమిళనాడు ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.

23 రాష్ట్రాల్లో15 అధికారం నిలబెట్టుకున్నాయి

గత ఐదేళ్లలో జరిగిన 23 రాష్ట్రాల ఎన్నికల్లో 15 రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయని తెలిపింది. అధికారాన్ని నిలబెట్టుకున్న ఆయా రాష్ట్రాలో పురుషుల ఓటు శాతం కంటే మహిళల ఓటు శాతం ఒక శాతం పెరిగిందని వెల్లడించింది.

ఇదే చదవండి:దీదీ బం'గోల్'- 213 స్థానాల్లో టీఎంసీ పాగా

Last Updated : May 14, 2021, 11:41 PM IST

ABOUT THE AUTHOR

...view details