తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేక ధర రూ.70 లక్షలు.. స్పెషల్ ఏంటో తెలుసా?

మేక ధర ఏకంగా రూ.70 లక్షలు! రూ.22 లక్షలిస్తామన్నా అమ్మనని అంటున్నాడు దాని యజమాని. ఇంత భారీ ధర పలుకుతున్న మార్కెట్ ఎక్కడుంది?.. ఎందుకు ఈ మేకలు ఇంత ధర పలుకుతున్నాయి? ఓ సారి తెలుసుకుందామా..

ost expensive goat market
అత్యంత ఖరీదైన మేకలు

By

Published : Jul 10, 2022, 10:08 AM IST

Updated : Jul 10, 2022, 11:20 AM IST

మేక ధర రూ.70 లక్షలు.. స్పెషల్ ఏంటో తెలుసా?

ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని బైజ్​నాథ్ పరా మార్కెట్​కు వచ్చిన ఓ మేక అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ అనుప్పూర్​కు చెందిన వాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి.. మార్కెట్లో విక్రయించేందుకు తీసుకొచ్చిన తన మేకకు రూ.70లక్షలు ధర నిర్ణయించారు. ఈ మేకకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ప్రకృతి ఇచ్చిన ప్రసాదం అని అంటున్నారు.

బక్రీద్ సందర్బంగా విక్రయానికి వచ్చిన మేకలు

"మేక స్వదేశీ జాతికి చెందినది. ఈ మేక ప్రకృతి ప్రసాదం. దీని శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్​ అని రాసి ఉంది. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దీని ధరను రూ.70 లక్షలుగా నిర్ణయించా. సోషల్ మీడియాలో మేక చిత్రాన్ని పోస్టు చేశా. ఆ చిత్రాన్ని చూసి నాగపుర్​కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.22 లక్షలకు మేకను కొనుగోలు చేస్తానన్నాడు. ఆ ధరకు అమ్మేందుకు నేను అంగీకరించలేదు. ఈ మేకకు మరింత ఎక్కువ ధర లభిస్తుందని ఆశిస్తున్నా. నేను మేకల వ్యాపారిని. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. నేను, భార్య కాకుండా ఆరుగురు పిల్లలు ఉన్నారు. అందులో ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మేకను మంచి ధరకు అమ్మగా వచ్చిన డబ్బుతో నా కుమార్తెల పెళ్లి చేస్తాను."
-వాహిద్ హుస్సేన్, మేక యజమాని

మరోవైపు, మధ్యప్రదేశ్​.. అగర్ మాల్వా మార్కెట్లో రూ.11 లక్షల విలువైన మేక అమ్మకానికి వచ్చింది. సుస్నేర్ నివాసి షారుక్ ఖాన్ అనే వ్యక్తి ఈ మేకకు యజమాని. ఈ మేక పేరు సుల్తాన్. దాని శరీరంపై అల్లా, మహమ్మద్ అనే ఉర్దూ పేర్ల గుర్తులు ఉన్నాయని.. అందుకే మేకకు రూ.11 లక్షల ధర పెట్టానని చెబుతున్నాడు. సుల్తాన్ రోజుకు 100 గ్రాముల జీడిపప్పు, బాదం పప్పు తింటుందని చెబుతున్నాడు మేక యజమాని షారుక్. ఈ మేక మూడున్నర అడుగుల పొడవు, 60 కేజీల బరువుందని తెలిపాడు.

మేకలను మార్కెట్​లోకి తీసుకొచ్చిన యజమానులు

రాజస్థాన్​.. జైపుర్​లోని ఈద్గా మార్కెట్​లోని మేకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి చెవులు, పొట్టపై అల్లా అని రాసి ఉంది. అలాగే మరికొన్ని మేకల శరీరాలపై నెలవంక గుర్తులు ఉండటం.. వీటి డిమాండ్​కు కారణమవుతోంది. ఈ మేకలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. మార్కెట్‌లో ఈ మేకలతో ఫోటోలు కూడా దిగుతున్నారు. వీటి ధర చూసి కొనేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నప్పటికీ.. మేకల యజమానులు మాత్రం ధరను తగ్గించట్లేదు.

ఇవీ చదవండి:ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం... అసలు ఏమైందంటే?

కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. చంపేస్తానని బెదిరించి ఏడాదిన్నరగా..

Last Updated : Jul 10, 2022, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details