తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు

అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో జరగునున్న విచారణకు హాజరు కావాలని సూచించింది.

ed summons to hemant soren
ed summons to hemant soren

By

Published : Nov 2, 2022, 9:20 AM IST

Updated : Nov 2, 2022, 9:34 AM IST

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నవంబర్ 3న విచారణకు హాజరు కావాలని సూచించింది. గురువారం రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్టు చేసింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, బర్హైత్, రాజ్‌మహల్, మీర్జా చౌకీతో పాటు బర్హర్వాలోని 19 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, దోపిడీకి సంబంధించిన కేసులతో పంకజ్​ మిశ్రాకు సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న ఈడీ.. జులై 8న మిశ్రాతో పాటు ఆయన సహచరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది.

Last Updated : Nov 2, 2022, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details