తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోన్​​ యాప్​లపై ఈడీ కొరడా.. రూ.78 కోట్లు స్వాధీనం.. - చైనా లోన్ యాప్స్

రుణ యాప్​లకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరులోని 6 గేట్‌వే కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. చైనాకు చెందిన రుణ యాప్‌ల నుంచి రూ.78 కోట్లను స్వాధీనం చేసుకుంది.

ED raids on loan apps
లోన్​​ యాప్​లపై ఈడీ కొరడా

By

Published : Oct 21, 2022, 10:31 PM IST

Updated : Oct 21, 2022, 10:59 PM IST

కర్ణాటకలోని బెంగళూరులో సులభతర అప్పులు అని చెబుతూ ఎక్కువ వడ్డీలను దండుకుంటున్న చైనాకు చెందిన రుణ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కొరడా ఝులిపించింది. రుణ యాప్‌లకు చెందిన రూ. 78 కోట్ల రూపాయలను వాటి పేమెంట్‌ గేట్‌వేల నుంచి స్వాధీనం చేసుకుంది. బెంగళూరులోని 6 గేట్‌వే కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. రుణ యాప్‌లకు సంబంధించిన కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకుంది. ఆర్థిక దోపిడీ, మనీ లాండరింగ్‌ కేసులు నమోదు కింద రూ.78కోట్లు సీజ్‌ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

కాగా, కొన్ని లోన్ యాప్స్.. సత్వర రుణాల పేరుతో వినియోగదారులను ఆకర్షించి ఆ తర్వాత వేధింపులు గురిచేస్తున్నాయి. ఈ లోన్‌ యాప్‌లు తొలుత సత్వర రుణాలతో వినియోగదారులను ఆకట్టుకుని.. ఆ తర్వాత రుణం మంజూరైన వినియోగదారుల నుంచి అత్యధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చెప్పిన వడ్డీ ఇవ్వకపోతే వారిపై బెదిరింపులు పాల్పడుతుండంతో ఈ యాప్​లపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ లోన్‌ యాప్‌లు ఎక్కువ చైనాకు చెందినవేనని తెలిసింది. దీంతో ఈడీ వాటిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా బెంగళూరులోని ఆరు గేట్​వే కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ.. రూ.78 కోట్లను సీజ్​ చేసింది.

ఇదీ చూడండి:ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్​గా సోలార్​ ప్యానల్స్.. ఇక కరెంట్ బిల్​ నుంచి విముక్తి!

Last Updated : Oct 21, 2022, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details