తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కిలోల కొద్దీ బంగారం.. కోట్ల రూపాయల డబ్బు.. ఈడీ అధికారులు షాక్ - భారీగా నగదును జప్తు చేసిన ఈడీ

మహారాష్ట్రలో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులు భారీగా నగదు, ఆభరణాలు సీజ్ చేశారు. పంకజ్‌ మెహాదియా, లోకేశ్‌, కార్తిక్ జైన్‌ పెట్టుబడి మోసాలు చేశారన్న ఆరోపణలతో వారికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 5.51 కోట్లు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.1.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ed raids in nagpur
సోదాలు జరిపిన ఈడీ

By

Published : Mar 6, 2023, 5:44 PM IST

Updated : Mar 6, 2023, 6:40 PM IST

మనీలాండరింగ్ కేసులో ముంబయి, నాగ్​పుర్​లో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్​ఫోర్స్​మెంట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. 15 వేర్వేరు ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిపింది. ఈ సోదాల్లో పంకజ్ మెహాదియా, లోకేష్ జైన్​, కార్తీక్​ జైన్​ చెందిన నివాసాలు, కార్యాలయాల్లో రూ.5.51 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.1.21 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి ఆఫీసుల్లోని డిజిటల్ యంత్రాలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.

'పెట్టుబడిదారులను మోసగించి కోట్ల రూపాయలు కాజేసిన కేసులో పంకజ్ మెహాదియా, లోకేష్ జైన్, కార్తీక్ జైన్, బల్ముకుంద్ లాల్‌చంద్, ప్రేమలత మెహాదియాపై సీతాబుల్డి పోలీస్​ స్టేషన్​లో నమోదైన ఎఫ్​ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాం. అందుకే వారి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించాం. రూ.5.51 కోట్లు విలువైన ఆభరణాలు, రూ.1.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం.' అని ఈడీ పేర్కొంది.

పంకజ్ మెహాదియా తన సహచరులతో కలిసి పొంజీ పథకాన్ని నడుపుతున్నాడు. 2004 నుంచి 2017 వరకు పెట్టుబడిదారులకు 12 శాతం లాభం ఇస్తానని నమ్మించి పెట్టుబడులను ఆకర్షించాడు పంకజ్. వ్యాపారం సజావుగా సాగుతోందని వారికి నమ్మకం కలిగించేందుకు బ్యాంకులో రూ.150కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారు. ఈ కేసులో భాగంగా మెహాదియా, అతడి అనుచరుల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు జరిపి భారీగా నగదు, బంగారాన్ని జప్తు చేశారు.

ఈడీ స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి ఆభరణాలు
ఈడీ స్వాధీనం చేసుకున్న ఆభరణాలు
ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు

రూ.3 కోట్లు స్వాధీనం..
ఝార్ఖండ్‌.. హజారీబాగ్‌లో ఐఏఎస్‌ అధికారి పూజా సింఘాల్‌, మరికొందరిపై మనీలాండరింగ్‌ కేసులో చేపట్టిన సోదాల్లో మార్చి 3న ఈడీ అధికారులు రూ.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్‌ అన్సారీకి చెందిన నివాసంలో రూ.500, రూ.2000 నోట్ల కట్టలను గుర్తించి జప్తు చేశారు. ఉపాధి గ్రామీణ హామీ పథకంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2000 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి పూజా సింఘాల్‌ను 2022 మే 11న ఈడీ అరెస్టు చేసింది. ఆమె కుమార్తె అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరిలో పూజా సింఘాల్‌కు సుప్రీంకోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

దిల్లీలో సోదాలు..
గతేడాది జూన్​లో అప్పటి దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్, మరికొందరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు నాణేలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా అందిన సమాచారం ఆధారంగా దిల్లీలోని ఏడు చోట్ల సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రామ్‌ ప్రకాశ్‌ జ్యువెలర్స్‌ లిమిటెడ్‌ పరిసరాల్లో రూ.2.23 కోట్లు సీజ్‌ చేసినట్టు దర్యాప్తు వెల్లడించారు. అలాగే సత్యేందర్‌ జైన్‌, ఆయన సన్నిహితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో మొత్తంగా రూ.2.85 కోట్ల నగదుతో పాటు 1.8 కిలోల బంగారం, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Last Updated : Mar 6, 2023, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details