తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ED Raids at Prathima Medical College : రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. మెడికల్‌ కాలేజీల్లో అక్రమాలు?

ED Raids
ED Raids

By

Published : Jun 21, 2023, 12:17 PM IST

Updated : Jun 21, 2023, 8:32 PM IST

12:11 June 21

కరీంనగర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో ఈడీ తనిఖీలు

ED Raids on Telangana Medical Colleges : పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి వాటిని అక్రమంగా మేనేజ్‌మెంట్ సీట్ల క్రింది విక్రయించుకుని సొమ్మ చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలంగాణాలోని 9 ప్రైవేట్‌ మెడికల్ కళాశాలు, వాటికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. గతేడాది వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడ ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఉదయం నుంచి బృందాలగా విడిపోయి మొత్తం 16 చోట్ల సోదాలు చేస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీట్‌ పీజీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్‌ను వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌ సైన్సెస్ నిర్వహిస్తుంది. మేనేజ్‌మెంట్ కోటాలో మూడు విభాగాలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా 1, 2,3. మేనేజ్‌ మెంట్ కోటా 1 ఫీజు రూ.23-రూ.24లక్షలు ఉండగా.. ఎన్‌ఆర్‌ఐ కోసం నిర్వహించే మేనేజ్‌మెంట్ కోటా 2 ఫీజు దానికి మూడింతలు ఉంటుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత మేనేజ్‌మెంట్ కోటా 3లో మిగిలిపోయిన సీట్లు, లేదా క్యాన్సిల్ చేసుకున్న సీట్లను కళాశాలలు వారికి ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు.

ED Raids In Telangana Medical Collages : ఇదే క్రమంలో నీట్‌లో మంచి ర్యాంకు వచ్చిన వారు మేనేజ్‌ మెంట్ కోటా 1లో సీటును ఎంచుకుని అడ్మిషన్‌కు ఒక రోజు ముందు దానిని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తద్వారా ఆ సీట్‌ మేనేజ్‌మెంట్ కోటా 3లోకి వెళుతుంది. ఈ సీట్లను పలు కళాశాలలు కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారని కాళోజీ యూనివర్సిటి గుర్తించింది. సీట్లను బ్లాక్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని విద్యార్ధులకు మెయిల్‌ పెట్టగా.. కొందరు తాము అసలు అప్లై కూడా చేయలేదని తేలింది. దీంతో కొన్ని కళాశాలలు, దళారులు వారి సర్టిఫికెట్లు సైతం పెట్టుకుని సీట్లను బ్లాక్ చేసి అధిక ధరకు పీజీ మెడికల్ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని గతేడాది వరంగల్‌ మట్టెవాడ పోలీసుకు యూనివర్శిటి రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు.

యూనివర్సిటీ ఫిర్యాదుతో రంగంలోకి ఈడీ : వరంగల్ మట్టెవాడ ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా పలు ఆధారాలు సేకరించింది. రాష్ట్రంలోని 9 ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాల సీట్ల భర్తీకి సంబంధించిన వివరాలు సేకరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, నార్కెట్‌పల్లిలోని కామినేని మెడికల్ కళాశాలలు, మహబూద్‌ నగర్‌లోని ఎస్‌వీఎస్‌, కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాల, చల్మెడ ఆనందరావు కళాశాల, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌, సూరారంలోని మల్లారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని మెడీసీటీ, డెక్కన్‌ మెడికల్ కళాశాల, హైదరాబాద్, ఖమ్మంలో ఉన్న మమత మెడికల్ కళాశాలలు సహా ఆయా కళాశాలలు, కార్పోరేట్ కార్యాలయాలు, ఎండీల ఇళ్లతో కలిపి మొత్తం 16 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ED Raids at Prathima Medical College : ఉదయం హైదరాబాద్‌లో కార్యాలయం నుంచి సీఆర్‌పీఎఫ్ దళాలతో కలసి బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దళారులతో పాటు కొందరు నీట్‌ ర్యాంకర్ల సహకారంతో కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి వాటిని చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేసి మేనేజ్‌మెంట్‌ కోటా 3 కింద విక్రయిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగా ఈడీ సోదాలు చేస్తుంది. కళాశాలల రికార్డులు పరిశీలిస్తుంది. కౌన్సిలింగ్ జరిగిన తేదీలు, సీట్లు క్యాన్సిల్ చేసుకున్న తేదీలను పరిశీలిస్తుంది.

ED Raids at SVS Medical College :కళాశాలల బ్యాంకు ఖాతాలు ఈడీ పరిశీలిస్తుంది. సమస్యాత్మక లావాదేవీలపై ఆరాతీస్తోంది. బ్యాంకు స్టేట్‌మెంట్లను పరీశీలిస్తోంది. సోదాల్లో అక్రమాలు జరిగాయని తేలితే.. నోటీసులు ఇచ్చి బషీరాబాగ్‌ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి సొమ్ము చేసుకున్నారని తేలితే వాటి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను సైతం ఈడీ జప్తు చేస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు విడుదల చేసే ప్రకటనతో మరిన్ని విషయాలతో పాటు కేసు దర్యాప్తు అంశాలు వెలుగులోకి రానున్నాయి.

Last Updated : Jun 21, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details