తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ED Notices to Hero Navdeep : 10న విచారణకు రండి.. సినీనటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు - ED notices for hero Navdeep

Hero Navdeep
Navdeep

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 9:35 AM IST

Updated : Oct 7, 2023, 10:50 AM IST

09:31 October 07

ED Notices to Hero Navdeep : సినీనటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు

ED Notices to Hero Navdeep : హైదరాబాద్​లోని మాదాపూర్​ మాదక ద్రవ్యాల కేసులో (Madhapur Drugs Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ విచారణలో వారు చెబుతున్న విషయాలు.. వారి ఫోన్ డేటా సాయంతో మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితుల కాల్ డేటాలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ నటుడు నవదీప్​ను విచారించిన విషయం తెలిసిందే.

Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్​డేటాలో అసలుగుట్టు

ED Notices to Navdeep in Madhapur Drugs Case :అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో నటుడు నవదీప్​కు (Navdeep) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో నవదీప్​కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Madhapur Drugs Case Update :ఇటీవలే మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్‌ పోలీసులు (Narcotics Police) విచారించిన విషయం తెలిసిందే. సుమారు 6 గంటల పాటు విచారించారు. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ లిస్ట్ ముందుంచి.. నవదీప్‌ నుంచి పలు సమాచారం రాబట్టారు. మరోవైపు.. వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్ చేయనున్న అధికారులు.. డేటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను విచారించే అవకాశం ఉంది.

Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ

Madhapur Drugs Case Latest Update :నార్కోటిక్ పోలీసుల విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. తానెప్పుడూ.. ఎక్కడా డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన రామ్‌చందర్‌తో పరిచయం మాత్రమే ఉందని.. అతనితో ఎలాంటి డ్రగ్స్‌ డీలింగ్ చేయలేదని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కేసులో తనకు నోటీసులు ఇచ్చినందున విచారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో సీపీ సీవీ ఆనంద్‌, ఎస్పీ సునీతా రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పని చేస్తున్నాయని నవదీప్ కితాబిచ్చారు.

గతంలో ఒక పబ్‌ను నిర్వహించినందుకు పిలిచి విచారించారని నవదీప్ తెలిపారు. అప్పడు సిట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిందని.. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారని పేర్కొన్నారు. నార్కోటిక్ అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానాలు ఇచ్చానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని నవదీప్ వెల్లడించారు.

ఈఏడాది సెప్టెంబరు 14న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ ముఠానుంచి పలు రకాల మత్తుపదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా.. సినీనటుడు నవదీప్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఆ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా పోలీసులు పేర్కొన్నారు.

Narcotics Bureau SP Sunitha Reddy Interview : 'మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నిందితుల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు'

Madhapur Drugs Case Updates : నిత్యం వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​ @ యాక్టర్ నవదీప్

Last Updated : Oct 7, 2023, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details