Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ ఆంక్షలను సడలించింది కేంద్రం ఎన్నికల సంఘం. విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
విజయోత్సవ ర్యాలీలపై ఈసీ కీలక నిర్ణయం - ఎన్నికల కౌంటింగ్
Election Results 2022: విజయోత్సవ ర్యాలీలపై విధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొవిడ్ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్న ఆంక్షలను ఈసీ ఇటీవల సడలించింది.
ఈసీ
ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనే ఈసీ.. ఆంక్షలను కూడా విధించింది. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలను విధించిన ఈసీ.. ఆ తర్వాత క్రమంగా సడలింపులు చేసింది.
ఇదీ చూడండి :'యూపీలోని 17 జిల్లాల్లో హింసకు ఛాన్స్'.. ఐబీ హెచ్చరికతో అలర్ట్