తెలంగాణ

telangana

ఎన్నికల వేళ రూ.22 కోట్ల బంగారం సీజ్

By

Published : Mar 11, 2021, 10:55 PM IST

తమిళనాడులోని చిన్న కంథాల్​చెక్​ పోస్టు వద్ద రూ.22 కోట్లు విలువచేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. వీటికి సరైన పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

EC seizes 22 crores worth gold at Tirupathur
రూ.22 కోట్ల విలువైన బంగారం పట్టివేత

తమిళనాడులో భారీగా బంగారాన్ని సీజ్ చేసింది ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్. తిరుపత్తూర్​ జిల్లా చిన్న కంథాల్ చెక్​పోస్ట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో రూ.22 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

తనిఖీలో పట్టుకున్న మినీ వ్యాన్

వ్యాను యజమానిని హోసూర్ టైటాన్​గా గుర్తించారు అధికారులు. ఈ బంగారాన్ని జ్యువెల్లరీ దుకాణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సరైన పత్రాలను చూపించినట్లు సమాచారం. అయితే.. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో బంగారం తరలించకూడదని ఈ వ్యాన్​ను సీజ్​ చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:వైభవంగా 'ఈశా ఫౌండేషన్'​ మహాశివరాత్రి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details