తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో బలగాల మోహరింపు' - బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలు

ఎన్నికల సందర్భంగా కేవలం బంగాల్​లోనే కేంద్ర పోలీస్​ బలగాలను మోహరిన్నట్లు వస్తున్న వార్తలను ఎన్నికల సంఘం ఖండించింది. కేవలం బంగాల్​లో మాత్రమే కాదని ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రానికి బలగాలను పంపుతామని స్పష్టం చేసింది. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోందని తెలిపింది.

EC says West Bengal not singled out, central forces deployment a routine practice in all poll-bound states
'ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రానికి బలగాలు- బంగాల్​ ప్రత్యేకం కాదు'

By

Published : Feb 22, 2021, 10:25 PM IST

కేవలం బంగాల్​లో మాత్రమే కాదని ఎన్నికలు జరగనున్న మిగతా రాష్ట్రాలకు సైతం పోలీస్​ బలగాలను పంపనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విధానం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోందని తెలిపింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని సంక్లిష్టమైన ప్రాంతాల్లో ముందస్తు భద్రత కోసమే కేంద్ర పోలీస్​ బలగాలను పంపించనున్నామని వివరించింది. కేవలం బంగాల్​లో మాత్రమే పోలీస్​ బలగాలను మోహరిస్తున్నారని వస్తున్న వార్తలను ఈసీ ఖండించింది. 2019 ఎన్నికల సమయంలోనూ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పోలీస్​ బలగాలను పంపిస్తామని వివరించింది.

త్వరలో ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ, తమిళనాడు, బంగాల్​, పుదుచ్చేరిలో దాదాపు 25వేల మంది సెంట్రల్ పోలీస్ బలగాలను పంపించాలని సంబంధిత సెక్రటరీస్​, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం.

బంగాల్​కు ఎన్నికల అధికారి

బంగాల్​లో ఎన్నికల నేపథ్యంలో బంగాల్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్​ జైన్ బంగాల్​లో శుక్రవారం పర్యటించనున్నారు. ఎన్నికల కసరత్తుపై జిల్లా కలెక్టర్​లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం కానున్నట్లు పోల్ ప్యానెల్​ తెలిపింది. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతి భద్రత పై చర్చిస్తారని వివరించింది. అన్ని జిల్లాల్లో కేంద్ర పోలీస్ బలగాలను మోహరించటంపైనా అధికారులతో చర్చించనున్నట్లు పేర్కొంది. జైన్ పర్యటన అనంతరం... రిపోర్టును ఈసీకు అందిస్తారని స్పష్టం చేసింది.

294 అసెంబ్లీ సీట్లున్న బంగాల్​లో ఏప్రిల్​-మేలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి :'బంగాల్​లో సిండికేట్ రాజ్యం- పైసలిస్తేనే పని'

ABOUT THE AUTHOR

...view details