డీఎంకే నేత ఎ. రాజా 48 గంటలపాటు ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. తమిళనాడు సీఎం, ఆయన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తగిన సమాధానం ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఎ.రాజాకు ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం - తమిళనాడు శాసనసభ ఎన్నికలు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ ఎ.రాజా 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆయనను డీఎంకే స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించింది.
ప్రచారం నిర్వహించకుండా డీఎంకే ఎంపీ రాజాపై నిషేధం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందుకు రాజాను మందలించింది ఈసీ. డీఎంకే స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:'తల్లిని దూషించడం తప్పే.. క్షమించండి'
Last Updated : Apr 1, 2021, 2:41 PM IST