బంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరోసారి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాల మోహరింపుపై మార్చి 28, ఈ నెల 7న చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కేంద్ర బలగాలపై విమర్శల ద్వారా పలు ఐపీసీ సెక్షన్లను మమత ఉల్లంఘించారని నోటీసుల్లో స్పష్టం చేసింది. వీటిపై శనివారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలనిపేర్కొంది.
మమతా బెనర్జీకి మరోసారి ఈసీ నోటీసులు - election commision
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాల మోహరింపుపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
దీదీకు మరోసారి ఈసీ నోటీసులు..
కేంద్ర పారామిలిటరీ బలగాలపై మమత పూర్తిగా తప్పుడు, రెచ్చగొట్టే రీతిలో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ప్రాథమిక విచారణలో తేలింది. మత ప్రాతిపదికన ఓట్లు అడిగారనే ఆరోపణలపై మమతకు గతంలోనూ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి :బీడువారిన సింగూరు బతుకులు!