తెలంగాణ

telangana

ప్రచారంలో పాల్గొనే నేతలకు ఈసీ కీలక సూచనలు

By

Published : Apr 10, 2021, 5:13 AM IST

ప్రచారాల్లో పాల్గొనే నేతలకు, రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. గతేడాది జారీ చేసిన కొవిడ్ ప్రవర్తనావళి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు అభ్యర్థుల ప్రచారాన్ని, బహిరంగ సభలపై నిషేధం విధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది.

EC frets as star campaigners
ప్రచారంలో పాల్గొనే నేతలకు ఈసీ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే నేతలకు, రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం లేకుండా ఎన్నికల ప్రచారాలు సాగుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయంది. ప్రచారకర్తలు, రాజకీయ నేతలు, అభ్యర్థులు కొవిడ్ నిబంధనలను పాటించడం లేదని పేర్కొంది. ఫలితంగా కొవిడ్ వ్యాప్తి విస్తరించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.

గతేడాది జారీ చేసిన కొవిడ్ ప్రవర్తనావళి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు... గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు అభ్యర్థుల ప్రచారాన్ని, బహిరంగ సభలపై నిషేధం విధించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'ఓటమి భయంతోనే మమత దుష్ప్రచారం'

ABOUT THE AUTHOR

...view details