రెండు రాష్ట్రాల్లో భూకంపం (Earthquake news) ధాటికి ప్రజలు వణికిపోయారు. తొలుత ఝార్ఖండ్ సింహ్భూమ్లో మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదైంది. 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
అసోంలో..

అసోంలోనూ భూప్రకంపనలు (Earthquake news) సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైంది. శోణిత్పుర్లో 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సెప్టెంబర్ 29న కూడా అసోం తేజ్‌పుర్‌లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది.