తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత - ద్వారకా లేటెస్ట్ న్యూస్

ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. 99 ఏళ్ల వయసులో ఆయన మధ్యప్రదేశ్​ నార్సింగ్​పుర్​లోని పీఠంలో తుది శ్వాస విడిచారు.

shankaracharya swaroopanand saraswati
shankaracharya swaroopanand saraswati

By

Published : Sep 11, 2022, 5:55 PM IST

Updated : Sep 11, 2022, 7:00 PM IST

ద్వారకాపీఠ్​ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. 99 ఏళ్ల వయసున్న ఆయన.. మధ్యప్రదేశ్​ నార్సింగ్​పుర్​లోని పీఠంలో తుదిశ్వాస విడిచారు. స్వామి స్వరూపానంద సరస్వతి 1924 సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటి నుంచి వెళ్లిపోయిన స్వరూపానంద.. మతప్రచార యాత్రలు చేపట్టారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సంతాపం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 19 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలో దూకిన విప్లవ సాధువుగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఆయన తొమ్మిది నెలలు వారణాసి, ఆరు నెలలు మధ్యప్రదేశ్​లోని ఓ జైలులో గడిపారు. 1950లో దండి సన్యాస దీక్ష చేపట్టిన ఆయన స్వామి స్వరూపానంద సరస్వతిగా ప్రసిద్ధి చెందారు. హిందువులను ఏకం చేయాలనే సంకల్పంతో ఆది గురు శంకరాచార్య దేశంలో నాలుగు మత రాజధానులను చేయగా.. ద్వారక పీఠానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు స్వరూపానంద సరస్వతి.

Last Updated : Sep 11, 2022, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details