Drugs Seized: దేశ పశ్చిమ తీరంలో 763 కిలోల మాదక ద్రవ్యాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముందస్తు సమాచారంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, నేవీ జాయింట్ ఆపరేషన్‌లో ఈ మేరకు డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్నవాటిలో 529 కిలోల నాణ్యమైన గంజాయి, 234 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్, హెరాయిన్ ఉన్నట్లు ఎన్సీబీ తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ బ్యాగులను పోరుబందర్ తీరానికి అధికారులు తీసుకువచ్చారు.