తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో వందల కిలోల డ్రగ్స్​ స్వాధీనం.. విలువ రూ. 1200 కోట్లపైనే! - దిల్లీ లేటెస్ట్ న్యూస్

Drugs Seized In Delhi : దిల్లీలో భారీ డ్రగ్స్​ రాకెట్​ను పట్టుకున్నారు పోలీసులు. సుమారు 322.5 కిలోల మాదకద్రవ్యాలను దిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Drugs Seized In Delhi
Drugs Seized In Delhi

By

Published : Sep 6, 2022, 10:05 PM IST

Drugs Seized In Delhi : దేశంలో మరొ భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను దిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్‌) ఉండటం గమనార్హం. దీంతోపాటు 10కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తుండటం గమనార్హం.

అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా (23), రహీముల్లా రహీమ్‌ (44) 2016 నుంచి భారత్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్‌ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు పోలీసులుగుర్తించారు. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్‌ను దిల్లీకి తీసుకువస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. దిల్లీలోని కాలిందికుంజ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు.

ఇందుకు సంబంధించిన విషయాలను దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కమిషనర్ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ మీడియాకు వెల్లడించారు. 'పక్కా సమాచారంతో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు అఫ్గాన్‌ జాతీయులను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి 312.5 కేజీల మెథాంఫేటమిన్‌, 10 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ దాదాపు రూ.1200కోట్లు ఉంటుంది' అని తెలిపారు. నిందితుల ఇళ్ల వద్ద కూడా సోదాలు చేశామని, డ్రగ్స్‌ తయారీకి వినియోగించే కొన్ని నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:బెంజి కారులో వచ్చి రేషన్ తీసుకెళ్లిన 'పేదవాడు'.. వీడియో వైరల్​

షాకింగ్​ వీడియో.. మహిళ మీద నుంచి దూసుకెళ్లిన వాటర్​ ట్యాంకర్.. అక్కడికక్కడే..

ABOUT THE AUTHOR

...view details