ముంబయి క్రూజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీ కేసులో (Mumbai Rave Party news) మరో కోణం బయటపడింది. ఓ మహిళా నిందితురాలు.. శానిటరీ న్యాప్కిన్స్లో డ్రగ్స్‌ను పార్టీకి తీసుకెళ్లింది. ఆమె నుంచి ఐదు గ్రాముల ఎండీ పిల్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) (Drugs news) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ దాచిన శానిటరీ న్యాప్కిన్స్ శానిటరీ న్యాప్కిన్స్ను తెరుస్తున్న దృశ్యం శానిటరీ న్యాప్కిన్స్ చుట్టి తీసుకెళ్లిన డ్రగ్స్ ఈ రేవ్‌పార్టీ (Mumbai Rave Party) కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
సముద్రం మధ్యలో పార్టీ
ఈ నెల 3న ముంబయి తీరంలో క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై (Mumbai Rave party news) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎన్సీబీ అధికారులు.. తమని తాము ప్యాసింజర్లుగా పరిచయం చేసుకొని నౌకలోకి ప్రవేశించారు. ఈ నౌక గోవాకు వెళ్లినట్లు తెలిపారు. ముంబయి తీరం నుంచి నౌక బయల్దేరి సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీ ప్రారంభమైందని చెప్పారు.
ఈ కేసులో (Mumbai Rave Party news) బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
ఇదీ చూడండి:40 మంది ఉపాధ్యాయులకు ఎన్ఐఏ సమన్లు