త్రిపురలోని అగర్తలాలో డ్రగ్స్ ముఠా నాయకుడైన నాహిద్ మియాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ప్రత్యేక కార్యదళం.. నిందితుడి ఇంటిపై దాడి జరిపి అతడిని పట్టుకుంది.
'నగరంలో నాహిద్ మియా, రాజు దాస్, గెహ్నా అనే ఈ ముగ్గురు వ్యక్తులకు చెందిన ముఠా ద్వారానే మాదకద్రవ్యాల పంపిణీ జరుగుతుంది. మేము ఈ ముగ్గురు వ్యక్తుల ఇళ్లపై దాడి చేశాము. ఈ క్రమంలోనే నాహిద్ పట్టుబడ్డాడు. కానీ గెహ్నా, రాజు తప్పించుకున్నారు. ఎంజీఎం బజార్ నుంచి వీరు కార్యకలాపాలు నిర్వహిస్తారు. తరచూ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ వెళ్తారు. ఆ దేశం నుంచే ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేస్తారని భావిస్తున్నాం.'