తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మద్యం తాగితే జైలు శిక్ష లేనప్పుడు.. డ్రగ్స్​ తీసుకుంటే ఎందుకు?' - shahrukh khan news

షారుక్​ఖాన్​ కుమారుడు ఆర్యన్​ఖాన్​ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి రాందాస్​ అఠవాలే. డ్రగ్స్​ తీసుకునే వారిని జైళ్లకు కాదని, రిహాబ్​ సెంటర్లకు పంపాలని అభిప్రాయపడ్డారు. మద్యం తీసుకునే వారిని జైళ్లకు ఎందుకు పంపరని ప్రశ్నించిన ఆయన.. చట్టాల్లో మార్పు తీసుకురావాలని స్పష్టం చేశారు.

ramdas athawale
'మద్యం తీసుకుంటే జైళ్లల్లో వేయరేందుకు?'

By

Published : Oct 28, 2021, 8:37 AM IST

డ్రగ్స్​ తీసుకునే వారిని జైలుకు కాదని, రిహాబ్​ సెంటర్లకు పంపించాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్​ అఠవాలే అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చట్టంలో మార్పులు చేయాలన్నారు. డ్రగ్స్​ కేసులో ఆర్థర్​ రోడ్డు జైలులో ఉన్న షారుక్​ కుమారుడు ఆర్యన్​ఖాన్​ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మద్యం సేవించే వారు జైళ్లకు వెళ్లడం లేదు. కానీ డ్రగ్స్​ తీసుకునే వారిని జైళ్లకు పంపేందుకు చట్టాలు ఉన్నాయి. డ్రగ్స్​ తీసుకునే వారిని జైళ్లకు కాకుండా.. రిహాబ్​కు పంపాలని మేము భావిస్తున్నాము. చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది."

--- రాందాస్​ అఠవాలే, కేంద్రమంత్రి.

ఆర్యన్​ఖాన్​ రిహాబ్​ సెంటర్​కు వెళ్లాలని ఇటీవలే వ్యాఖ్యానించారు అఠవాలే.

'యుక్తవయస్సులో డ్రగ్స్​ తీసుకోవడం మంచిది కాదు. ఆర్యన్​ఖాన్​కు మంచి భవిష్యత్తు ఉంది. ఆర్యన్​ను రిహాబ్​​ సెంటర్​కు పంపాలని షారుక్​కు సూచిస్తాను. జైలులో కాకుండా.. 1-2 నెలలు అక్కడే ఉండాలి. దేశంలో ఇలాంటి కేంద్రాలు చాలా ఉన్నాయి. డ్రగ్స్​ వ్యసనం నుంచి రెండు నెలల్లో బయటపడతాడు,' అని తెలిపారు అఠవాలే.

ఈ నెల 2న ముంబయిలోని ఓ క్రూజ్​ షిప్​లో డ్రగ్స్​ పార్టీని ఎన్​సీబీ బృందం అడ్డుకుంది. క్రూజ్​లో ఉన్న ఆర్యన్​ను 3వ తేదీన అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ఆర్యన్​కు ఇంకా బెయిల్​ లభించలేదు.

ఇదీ చూడండి:-జైలు ఖర్చుల కోసం ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్

ABOUT THE AUTHOR

...view details