ఆత్మనిర్భర భారత్కు ఊతమిచ్చేలా, దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అడుగు ముందుకేసింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ బరువుతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెట్ మిసైల్(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా పరీక్షించింది. థర్మల్ సైట్తో అనుసంధానమైన పోర్టబుల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది డీఆర్డీఓ. డైరెక్ట్ అటాక్ మోడ్లో లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపింది.
ఈ క్షిపణి గరిష్ఠ పరిధిలో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించగా.. కనిష్ఠ పరిధిలో చేపట్టిన ప్రస్తుత పరీక్ష కూడా విజయవంతమైంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ గరిష్ఠ పరిధి 2.5 కిలోమీటర్లు. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. దీనిని ఎక్కడికైనా మోసుకెళ్లేలా రూపొందించారు.