తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చలిని జయించేందుకు సైన్యానికి కొత్త అస్త్రాలు

ఎముకలు కొరికే చలిలో దేశ సరిహద్దులను కాపలా కాసే సైనికుల అవసరాల కోసం సరికొత్త ఆవిష్కరణలు చేసింది డీఆర్​డీఓ. చలిలో పనిచేసే సైన్యానికి వెచ్చదనం అందించేలా హిమ తాపక్ అనే పరికరాన్ని తయారు చేసింది. తాగునీటి సమస్యతో పాటు, చలిలో తగిలే గాయాల నుంచి రక్షణ కోసం పరిష్కార మార్గాలు కనిపెట్టింది.

drdo devices for indian army
చలిని తట్టుకునేలా సైన్యానికి డీఆర్​డీఓ పరికరాలు

By

Published : Jan 10, 2021, 3:31 PM IST

అత్యంత చలిలో పహారా కాసే జవాన్ల కోసం డీఆర్​డీఓ అధునాతన పరికరాలను రూపొందించింది. తూర్పు లద్దాఖ్, సియాచిన్​లోని ఎత్తైన ప్రాంతాల సైనికుల కోసం 'హిమ తాపక్' అనే స్పేస్ హీటింగ్ పరికరాన్ని తయారు చేసింది. సాధారణ హీటర్ల వల్ల జరిగే కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్​ నుంచి దళాలను రక్షించడమే ఈ పరికరం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

హిమ తాపక్ పరికరం

కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల వల్ల ఏ ఒక్క జవాను ప్రాణం పోకూడదని డిఫెన్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోలజీ, అలైడ్ సైన్సెస్ డైరెక్టర్ రాజీవ్ వర్ష్నీ పేర్కొన్నారు. ఇలాంటి పరికరాల కోసం భారత సైన్యం నుంచి రూ. 420 కోట్ల ఆర్డర్లు అందినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, చలి కురుపులు, హిమఘాతము(మంచువల్ల శరీరం మొద్దుబారటం) సహా గాయాల సమస్యలకు పరిష్కారంగా 'అలోకల్ క్రీమ్'ను తయారు చేసినట్లు రాజీవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం 3 నుంచి మూడున్నర లక్షల జాడీల క్రీమ్ కోసం భారత సైన్యం ఆర్డర్లు ఇస్తుందని చెప్పారు.

అలోకల్ క్రీమ్

మంచు కరిగించి..

తాగునీటి సమస్యకు సైతం డీఆర్​డీఓ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. గడ్డ కట్టించే ఉష్ణోగ్రతలలోనూ సులభంగా నీటిని తయారు చేసుకునే విధానాన్ని ఆవిష్కరించింది. మంచును కరిగించే సోలార్ పరికరాలను సియాచిన్, ఖర్దుంగ్లా, తవాంగ్ ప్రాంతాల్లో ప్రయోగిస్తోంది. ఈ పరికరాల ద్వారా గంటకు 5-7 లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుందని డీఆర్​డీఓ శాస్త్రవేత్త సతీశ్ చౌహాన్ తెలిపారు.

మంచు కరిగించే పరికరంతో శాస్త్రవేత్త సతీశ్

ఇదీ చదవండి:

సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు..

ఇక ఎంత చలి అయినా సైన్యం బేఫికర్​

ABOUT THE AUTHOR

...view details