తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కృష్ణ ఎల్లకు విశ్వేశ్వరయ్య వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ - Krishna Ella Doctorate

Krishna Ella Doctorate: వ్యాక్సిన్ల అభివృద్ధికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత్​ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లకు మరో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కర్ణాటక బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం డాక్టరేట్​ అందజేసింది.

Krishna Ella Doctorate
కృష్ణ ఎల్లకు విశ్వేశ్వరయ్య యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌

By

Published : Mar 10, 2022, 5:53 PM IST

Krishna Ella Doctorate: కర్ణాటక బెళగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నికల్​ యూనివర్సిటీ భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. గురువారం క్యాంపస్‌లో జరిగిన 21వ స్నాతకోత్సవంలో ఆయన తరపున డాక్టరేట్​ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అందుకున్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ఈ పట్టాను అందజేశారు.

ఈ ఏడాది స్నాతకోత్సావాలకుగానూ డా. కృష్ణ ఎల్లతో పాటు మరో ఇద్దరు ఈ గౌరవ డాక్టరేట్​కు ఎంపికయ్యారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ రోహిణి గాడ్‌బోలే, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిష్ గోపాలకృష్ణన్‌కు కూడా డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని యూనివర్శిటీ ప్రకటించింది.

సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బుష్రా మతీన్ అనే విద్యార్థి 16 బంగారు పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. యూనివర్సిటీ చరిత్రలో అత్యధిక గోల్డ్​ మెడల్స్​ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 16 బంగారు పతకాలు సాధించిన బుష్రా మతీన్‌ను గవర్నర్ థావర్ చంద్ అభినందించారు.

ఇదీ చూడండి:జర్నలిస్ట్​ టూ సీఎం.. వరుసగా ఐదోసారి విజయదుందుభి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details