భారత్‌లో.. రష్యా కరోనా టీకా స్పుత్నిక్-వీ 2,3 దశల క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ నుంచి కావాల్సిన అనుమతులు పొందిన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాసౌలిలో ఈ ట్రయల్స్ చేపట్టినట్టు డా. రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఆర్డీఐఎఫ్(రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి) ఓ ప్రకటనలో వెల్లడించాయి.
జేఎస్ఎస్ మెడికల్ రీసర్చ్ సభ్యులు ఈ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. టీకా భద్రత సహా ఇతర ముఖ్య అంశాలపై ఇక్కడ అధ్యయనం జరుగుతుందని డా. రెడ్డీస్ వెల్లడించింది.