Wife Tease Murder In Mysore: తన భార్యను పదేపదే ఆటపట్టిస్తున్నారన్న కోపంతో.. స్నేహితులను హత్యచేశాడు ఓ వ్యక్తి. కర్ణాటక మైసూర్ జిల్లా హెచ్డీ కోటే మండలంలోని బోగడి రోడ్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతులను రవి, బసవగా గుర్తించారు పోలీసులు.
ఇదే జరిగింది..
హెచ్డీ కోటే మండలంలోని కొత్తెగల గ్రామానికి చెందిన రవి, బసవ, మహేశ్ స్నేహితులు. అయితే మహేశ్ భార్యపై రవి తరచుగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుండేవాడు. రవికి.. బసవ సహకరించేవాడు.
డిసెంబర్ 11న రాత్రి.. రవి, బసవ, మహేశ్, మరో స్నేహితుడు కలిసి బోగడి రోడ్డు వద్ద మందు పార్టీ చేసుకున్నారు. ఈ సమయంలో మహేశ్ భార్యను టీచ్ చేసే వ్యవహారం చర్చకు వచ్చింది. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేశ్.. పదునైన ఆయుధంతో రవి, బసవను పొడిచి చంపాడు.
ఈ ఘటనపై సరస్వతిపురం స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు మహేశ్, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చూడండి:బంగారు గొలుసును మింగేసిన గోవు.. చివరకు?