తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిద్రిస్తున్న తల్లీకూతుళ్ల తలలు నరికి హత్య.. మొరుగుతోందని కుక్కను కాల్చి చంపిన వ్యక్తి - కర్ణాటక లేటెస్ట్ న్యూస్

ఇంటి బయట పడుకున్న దళిత వర్గానికి చెందిన తల్లీకూతుళ్లను నరికి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అమరోహా జిల్లాలో జరిగింది. కర్ణాటక బెంగళూరులో జరిగిన మరో ఘటనలో కుక్క తరచూ మొరుగుతోందని ఆగ్రహించిన ఓ వ్యక్తి.. తుపాకీతో కాల్చి చంపాడు.

man shoots a dog
man shoots a dog

By

Published : Sep 18, 2022, 2:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అమరోహా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి బయట పడుకున్న దళిత వర్గానికి చెందిన తల్లికూతుళ్లను హత్యచేశారు. బయట పడుకున్న తల్లీకూతుళ్ల తలలను నరికి చంపారు.
పోలీసుల కథనం ప్రకారం.. గజ్​రౌలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కాక్​టెర్​ గ్రామంలో మిథ్లేశ్​ (38), ఆమె కుమార్తె యాశీ(10) నివసిస్తున్నారు. రోజూలాగే శనివారం ఇంటి ఆవరణలో పడుకున్న తల్లీకూతుళ్లు తెల్లారేసరికి శవాలై కనిపించారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో ఇద్దరు తలలను నరికి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మొరుగుతోందని కుక్కను కాల్చి చంపిన వ్యక్తి : కుక్క తరచూ మొరుగుతోందని ఆగ్రహించిన ఓ వ్యక్తి.. దానిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ కర్ణాటక బెంగళూరు గ్రామీణంలోని దూడ్డబళ్లాపుర్​ తాలుకాలో శనివారం జరిగింది. హరీశ్​ అనే వ్యక్తి 5 ఏళ్ల వయసున్న ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప పందులను పెంచుతున్నాడు. తనను చూసిన కుక్క మొరుగుతోందని ఆగ్రహించిన కృష్ణప్ప.. అతడి వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చి చంపాడు.

కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. వెంటపడి దానిని అంతమొందించాడు. కృష్ణప్పకు లైసెన్స్​ లేని నాలుగు తుపాకులు ఉన్నాయని.. అతడిపైన చర్యలు తీసుకోవాని హరీశ్​ కోరుతున్నాడు. తనకు సహాయం చేయాలంటూ జంతు సంరక్షణ ప్రతినిధులను ఆశ్రయించాడు​. దీనిపై దూడ్డబళ్లాపుర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అనంతరం శునకం మృతదేహాన్ని జంతు వైద్యశాలకు తరలించి శవపరీక్ష నిర్వహించారు.

ఇవీ చదవండి:టైప్​రైటర్స్​కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'

అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం

ABOUT THE AUTHOR

...view details