తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీధి కుక్కలకు ప్రేమతో'... రూ.7కే స్పెషల్ మీల్స్.. ఇంటినే దాబాగా మార్చి.. - food will be served street dogs in 7 Rupees indore

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం ఏదంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మధ్యప్రదేశ్​లోని ఇందౌర్. ఈ నగరం కేవలం పరిశుభ్రతలోనే కాదు జంతు పరిరక్షణ విషయంలోనూ ఎన్నో కొత్త కార్యక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నగరంలోని ఓ జంతు ప్రేమికుడు శునకాల కోసం తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నారు. శునకాల కోసం ఇంటినే దాబాగా మార్చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 25, 2023, 7:59 PM IST

ఇందౌర్​లో 7 రూపాయలకే శునకాలకు ఆహారం

వీధి శునకాల ఆకలి తీర్చడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్​ ఇందౌర్​లోని ఓ కుటుంబం స్పెషల్ దాబానే ఏర్పాటు చేసింది. డాగీ దాబా పేరుతో తమ ఇంటినే హోటల్​గా మార్చి.. ఏడు రూపాయలకే శునకాల ఆహారం విక్రయిస్తోంది. వీధి కుక్కల బాగోగులు చూసే జంతు ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని డాగీ దాబాను ప్రారంభించినట్లు దాని యజమాని బాల్​రాజ్ చెబుతున్నారు. మేఘ్​దూత్ నగర్​లో నివసంచే బాల్​రాజ్​ కుటుంబానికి జంతువులపై విపరీతమైన ప్రేమ. వాటి కోసం ఏదో ఒకటి చేయాలని భావించి.. ఈ దాబాను ప్రారంభించారు బాల్​రాజ్. నగరంలో ఎక్కడి నుంచైనా శునకాల ఆహారాన్ని ఆర్డర్ చేసే సదుపాయం కల్పించారు. సొంత వాహనాల్లో ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు.

"దాబాను ఏర్పాటు చేయడానికి రూ.3లక్షలు ఖర్చు అయ్యింది. ఇక్కడ వీటి కోసం బేకరి పదార్థాలు, కేక్​లను తయారు చేస్తాము. ప్రతిరోజు 500 ప్యాకెట్లను హోమ్​ డెలివరీ చేస్తాము. వాటికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాము. వెజ్, నాన్​వెజ్ ఆహార పదార్థాలు దాబాలో లభిస్తాయి. కస్టమర్ల కోరిక మేరకు శునకాలకు ఆహారాన్ని అందిస్తుంటాం. జూ పనిచేయడం వల్ల వాటికి ఎలాంటి ఆహారాన్ని ఎలా తినిపించాలి అని తెలుసు. వెజిటెబుల్, అన్నం, చికెన్ ఇవన్నీ మీల్​లో ఇస్తుంటాం. ఎప్పుడూ చికెన్​ పెడుతుంటే శునకాలకు బోర్ కొడుతుంది. కేవలం చికెన్​నే తినటం వల్ల అవి అంతగా ఎదగవు. అందుకే అన్నిటినీ కలిపి పెడుతుంటాం."
-బాల్​రాజ్, డాగీ దాబా యజమాని

కాస్ట్​లీ ఆహారం సైతం తమ దాబాలో లభిస్తుందని చెబుతున్నారు బాల్​రాజ్. ఏడు వందల రూపాయల ఆహారం సైతం అందుబాటులో ఉంటుందని చెప్పారు. శునకాల బాగోగులు చూసుకోవడం కోసం దాబాలో సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. పనుల మీద బయటకు వెళ్లే వ్యక్తులు... తమ పెంపుడు శునకాలను ఇక్కడ వదిలి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్నారు బాల్​రాజ్.

ప్రతి రోజూ ఆహార ప్యాకెట్లను మేఘదూత్ గార్డెన్‌కు తీసుకెళ్తుంటారు బాల్​రాజ్​. శునకాల కోసం అక్కడ రూ.7కే ఆహార ప్యాకెట్​ను విక్రయిస్తుంటారు. వీరు తయారు చేస్తున్న ఆహారం కూడా రుచిగా ఉండటం వల్ల వాటిని వీధి శునకాలు ఎంతో ఇష్టంగా తినేస్తున్నాయి. శునకాల కోసం వెజ్, నాన్​వెజ్​ పదార్థాలతో పాటు బేకరీ పదార్థాలను కూడా తయారు చేస్తున్నారు. అలాగే వాటి పుట్టినరోజు వేడుకలు జరపాలనుకుంటే ప్రత్యేకమైన కేక్​లను కూడా తయారు చేస్తున్నారు. అయితే కేక్​ల కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకోవాలి. త్వరలో నగరమంతా శునకాల ఆహారం కోసం ఫుడ్ డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నారు.

ఇవీ చదవండి:

'భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్​ ముగిసింది'.. రాజకీయాలకు సోనియా గుడ్​బై!

అండమాన్​పై చైనా బెలూన్లు! అమెరికా కంటే ముందే భారత్​పై నిఘా.. రాడార్​కు చిక్కకుండా..

ABOUT THE AUTHOR

...view details