తెలంగాణ

telangana

అయ్యో పాపం.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి వెళ్తే.. కుక్క దాడి!

By

Published : Sep 30, 2022, 3:21 PM IST

అనుకోకుండా కుక్క తోకపై కాలు వేసిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కుక్క వెంటనే మహిళ కాలిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

dog bite woman
మహిళపై కుక్క కాటు

పిల్లి కరిచిందని రేబిస్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఓ మహిళను కుక్క కాటు వేసింది. ఈ ఘటన కేరళ తిరువనంతపురంలోని విళింజమ్​లో జరిగింది.
విళింజమ్​కు చెందిన అపర్ణను పిల్లి కరిచింది. ఈ క్రమంలో టీకా కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఆమె.. అనుకోకుండా అక్కడ ఉన్న కుక్క తోకపై కాలు వేసింది. దీంతో కుక్క వెంటనే ప్రతిఘటించి.. అపర్ణ కాలిపై కాట్లు వేసింది. అపర్ణకు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమెకు సీహెచ్​సీ కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. కాసేపటి తర్వాత జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ కుక్క ఎప్పటి నుంచో అదే ఆస్పత్రిలో ఉంటోందని, దానికి రేబిస్ టీకా వేయలేదని అక్కడి వారు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details