Scissors in Stomach at Eluru:ఏలూరులో వైద్యుల నిర్వాకంఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. జిల్లాలోని బోధనాసుపత్రిలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే ఫోర్‌సెప్(కత్తెర)ను మహిళ పొట్టలో ఉంచి కుట్లు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెదపాడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామానికి చెందిన జి స్వప్న అనే మహిళ డెలివరీ కోసం ఏప్రిల్ 19వ తేదీన ఏలూరులోని బోధనాసుపత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ తరువాత స్వప్న డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో ఒక సర్జికల్ ఫోర్‌సెప్‌ను ఉంచి కుట్లు వేశారు. అప్పటి నుంచి తరచూ ఆమెకు కడుపులో నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే కాదా అనుకుని మందులు వాడేది.
వైద్యుల నిర్వాకం.. ఇనుప నట్టును తలపై ఉంచి కుట్లు.. ఆగని రక్తస్రావం.. చివరకు..
Refer to Vijayawada Hospital:స్వప్నకు ఈ నెల 8న కడుపు నొప్పి విపరీతంగా రావడంతో మరలా అదే ఏలూరులోని ఆసుపత్రిలో చేరింది. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమెను విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడకు వెళ్లాక ఏలూరు బోధనాసుపత్రి వైద్యుల నిర్వాకంబయట పడింది. విజయవాడ ఆసుపత్రి డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి ఎక్స్‌రే తీయగా ఆమె కడుపులో ఫోర్‌సెప్ ఉన్నట్లు తెలిసింది. ఏలూరు బోధనాసుపత్రిలోని డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసి.. ఆ ఆపరేషన్‌కు ఉపయోగించిన ఫోర్‌సెప్‌ను కడుపులోనే ఉంచేసి కుట్లు వేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిధర్‌ను వివరణ కోరగా జరిగిన ఈ విషయం నిజమేనని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పందించి విచారణ కమిటీ వేశారు.