Doctor Wrong Operation In Lucknow Uttar Pradesh :వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గాల్ బ్లాడర్ (పిత్తాశయం) సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్‌కు ఓ వైద్యుడు ఆపరేషన్ చేశాడు. ఆ తర్వాత యువకుడు మృతి చెందాడు. దీంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడి తండ్రి, వైద్యుడు సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన కమిషన్ నిందితులకి రూ.1.27 కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 30 రోజ్లుల్లోగా చెల్లించాలని డెడ్‌లైన్ విధించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగింది.
ఇదీ జరిగింది
ఫతేపుర్‌కు చెందిన జ్ఞాన్దేవ్ శుక్లా కుమారుడు శివమ్ శుక్లా 2015 కడుపు నొప్పితో లఖ్‌నవూలోని లోహియా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే డాక్టర్ అరుణ్ కుమార్, శివమ్‌కు పలు పరీక్షలు చేశాడు. రిపోర్టుల్లో శివమ్ పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత ఆపరేషన్ (Gall Bladder Stone Removal Surgery) చేయాలని డాక్టర్ అరుణ్ సూచించాడు. అయితే లోహియా ఆస్పత్రిలో టెలిస్కోపిక్ సౌకర్యం ఉన్నప్పటికీ ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు రోగిని తరలించాలని సిఫారసు చేశాడు అరుణ్. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు డాక్టర్ చెప్పిన హైకోర్టు సమీపంలోని నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అక్కడ శివమ్‌కు దాదాపు రూ.40 వేల వరకు వసూలు చేసి తప్పుడు ఆపరేషన్ చేశాడు డాక్టర్ అరుణ్.