తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూత్రపిండంలో రాళ్లొచ్చాయని ఆస్పత్రికి వెళ్తే..​ కిడ్నీ మాయం! - ఉత్తర్​ ప్రదేశ్​లో డాక్టర్​ కిడ్నీ తీసేసిన ఘటన

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు.. కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీనే తీసేశాడో డాక్టర్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలో జరిగింది.

doctor accidentally removed the kidney
doctor accidentally removed the kidney

By

Published : Nov 11, 2022, 10:39 AM IST

Updated : Nov 11, 2022, 11:40 AM IST

కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం ఆపరేషన్​ చేయించుకున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత.. మళ్లీ కడుపులో నొప్పి మొదలైంది. దీంతో మరోసారి స్కానింగ్​ తీసుకున్నాడు. ఆ రిపోర్టు రిజల్ట్​ చూసి బాధితుడు విస్తుపోయాడు. కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీనే తీసేశాడో డాక్టర్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలో జరిగింది.

బాధితుడు సురేశ్​ చంద్ర స్కానింగ్​ రిపోర్టులు

వివరాళ్లోకెళ్తే.. కాస్​గంజ్​ జిల్లా డీఎమ్​ నివాసంలో సురేశ్​ చంద్ర అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. 2022 ఏప్రిల్ 12న వెన్ను నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్​ స్కానింగ్​ పరీక్ష చేశారు వైద్యులు. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు రిపోర్టులో తేలింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో రెండు రోజుల తర్వాత 2022 ఏప్రిల్ 14న అలిగఢ్​ ఆస్పత్రిలో అతడికి కిడ్నీ ఆపరేషన్​ చేశారు. అనంతరం వైద్యుల సూచనతో కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం యథావిధిగా పనికి వెళ్లాడు. అయితే 2022 అక్టోబర్ 29న అతడికి సడెన్​గా కపుడు నొప్పి రావడం మొదలైంది. దీంతో మళ్లీ అల్ట్రాసౌండ్​ స్కానింగ్ తీసుకోగా.. రిపోర్టు చూసి విస్తుపోయాడు. రాళ్లను తొలగించేందుకు ఆపరేషన్​ చేసేటప్పుడు పొరపాటున అతడి కిడ్నీ తొలగించారు వైద్యులు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సురేశ్​ చంద్ర.

కిడ్నీ పోగొట్టుకున్న బాధితుడు సురేశ్​ చంద్ర
కిడ్నీ పోగొట్టుకున్న బాధితుడు సురేశ్​ చంద్ర
Last Updated : Nov 11, 2022, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details