తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని.. డీఎంకే సీనియర్ నేత ఎ. రాజా డిమాండ్ చేశారు. లాంగ్ లివ్ ఇండియా నినాదానికి డీఎంకే కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసిన రాజా.. ప్రత్యేక తమిళ దేశం కోసం డిమాండ్ చేసే పరిస్థితి తీసుకురానీయవద్దని హెచ్చరించారు. పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన రాజా.. ఈ మేరకు డిమాండ్ చేశారు.
'తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలి.. ప్రత్యేక దేశం కోసం పోరాడేలా చేయకండి' - తమిళనాడు స్వయం ప్రతిపత్తి
తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు డీఎంకే నేత రాజా. ప్రత్యేక దేశం కోసం పోరాటం చేసే పరిస్థితులను తేవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు విశ్రమించనని చెప్పారు.
రాజా
ద్రవిడ ఉద్యమకారుడు తాంథై పెరియార్ ప్రత్యేక తమిళనాడు దేశం కోసం పోరాటం చేశారని రాజా గుర్తుచేశారు. కానీ డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై బాటలోనే.. తమ ముఖ్యమంత్రి స్టాలిన్ నడుస్తున్నారని రాజా చెప్పారు. తమను పెరియార్ బాటలోకి నెట్టవద్దని.. మోదీ, అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు విశ్రమించనని చెప్పారు.
ఇదీ చూడండి:బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్రే.. రిపోర్ట్స్ చూస్తే...