ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల జరిగిన అఖిలపక్ష భేటీపై అసంతృప్తి వ్యక్తం చేసింది పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(గుప్కార్). రాజకీయ, ఇతర ఖైదీల విడుదల సహా విశ్వాసం నింపే చర్యల్లో స్పష్టత లేదని పేర్కొంది. ముఖ్యంగా 2019 నుంచి జమ్ముకశ్మీర్‌ను ఉక్కిరిబిక్కరి చేసిన అణచివేత చర్యలను అంతంచేయడానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడింది. గుప్కార్ ప్రతినిధి సీపీఎం నేత తరిగమ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రధానితో అఖిలపక్ష భేటీపై 'గుప్కార్' అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల దిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై గుప్కార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ, ఇతర ఖైదీల విడుదల సహా విశ్వాసం నింపే చర్యల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు.
గుప్కార్
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడి నివాసంలో ఫరూక్ అబ్దుల్లా అధ్యక్షతన గుప్కార్ సమావేశం జరిగినట్లు చెప్పారు. ఈ భేటీకి కూటమి ఉపాధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా ఇతర నేతలు హాజరైనట్లు తెలిపారు. గతనెల 24న దిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీపై చర్చించినట్లు తరిగమ్ పేర్కొన్నారు. రాజకీయ, ఇతర ఖైదీల విడుదలపై స్పష్టత లేకపోవటంపై సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:రఫేల్ ఒప్పందంపై రాహుల్ విమర్శలు
Last Updated : Jul 5, 2021, 2:28 PM IST