తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెల్త్ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగాలు- ఇంటర్, డిప్లొమా వారికీ ఛాన్స్- అప్లై చేశారా? - డీజీహెచ్​ఎస్ ఉద్యోగ నోటిఫికేషన్ అర్హతలు

Director General of Health Services Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే డైరెక్టర్ జనరల్​ ఆఫ్ హెల్త్​ సర్వీసెస్ (డీజీహెచ్​ఎస్ ).. పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరెవరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు? అప్లై చేయడానికి చివరి తేదీ ఏంటి? ఏఏ ఉద్యోగాలు ఉన్నాయి ? లాంటి వివరాలు మీ కోసం.

DGHS recruitment 2023
Director General of Health Services Recruitment 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 2:08 PM IST

Director General of Health Services Recruitment 2023 : మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ గుడ్​న్యూస్ మీకే! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్​ఎస్) పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఏ ఉద్యోగాలున్నాయి? వయో పరిమితి ఎంత? దరఖాస్తుకు చివరితేదీ మొదలైన వివరాలు మీకోసం.

ఏయే పోస్టులు(ఉద్యోగాల సంఖ్య)-విద్యార్హత

  • రిసెర్చ్​ అసిస్టెంట్(12)- సంబంధిత విభాగంలో పీజీ చేసి ఉండాలి
  • టెక్నీషియన్ (6)- సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి
  • హెల్త్ ఇన్స్​స్పెక్టర్(06)- ఇంటర్​(12), డిప్లొమా, ఏదైనా డిగ్రీ
  • లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (06)-ఇంటర్
  • ఫిజియోథెరపిస్ట్(06)-డిప్లొమా/ డిగ్రీ(ఫిజియోథెరపీ)
  • మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(06)- సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ
  • X-ray టెక్నీషియన్(06)- పదో తరగతి
  • మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీస్ట్(06)- డిగ్రీ(మెడికల్ లేబోరేటరీ సైన్స్)

వయో పరిమితి :

  • అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి.
  • గరిష్ఠ వయసు25, 27, 30 ఏళ్లు (పోస్టులను బట్టి)
  • నిబంధనల ప్రకారం వయో పరిమితిపై సండలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం
ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్​లైన్​లో డీజీహెచ్​ఎస్​ అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్​లో దరఖాస్తులు ప్రారంభం : 11-11-2023
  • ఆన్​లైన్​లో అప్లై చేయడానికి చివరి తేదీ : 30-11-2023
  • ఎంపిక విధానం, పరీక్షా కేంద్రాల వివరాలు, వేతనం, విద్యార్హతల మరిన్ని వివరాల కోసం డైరెక్టరేట్ జనరల్​ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్​ఎస్) అధికారిక వెబ్​సైట్​ ( https://hlldghs.cbtexam.in/Home/index.html ) ను సందర్శించండి.

సశస్త్ర సీమా బల్( ఎస్​స్​బీ)లో ఎస్​ఐ ఉద్యోగాలు
కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) 2023 సంవత్సరానికి సంబంధించి 111 సబ్​ ఇన్​స్పెక్టర్(ఎస్​.ఐ) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 19.

పోస్టులు

  • సబ్-ఇన్​స్పెక్టర్(పయోనీర్)-20-డిగ్రీ ,సివిల్ ఇంజినీరింగ్ డిప్లమా
  • సబ్​-ఇన్​స్పెక్టర్(డ్రాట్స్​మెన్)-3-పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • సబ్​-ఇన్​స్పెక్టర్(కమ్యూనికేషన్)-59-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్​ సైన్స్​లో డిగ్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్.
  • సబ్​-ఇన్​స్పెక్టర్(స్టాఫ్ నర్స్-ఫీమెల్)-29 -ఇంటర్మీడియేట్

వయో పరిమితి

  • అభ్యర్థులు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ నర్స్ పోస్టులకు యువతులు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
  • మరి ఈ ఉద్యోగానికి అప్లైచేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, జీత భత్యాలు, దరఖాస్తు విధానం లాంటి వివరాలకోసంఈ లింక్​ పై క్లిక్ చేయండి.

స్పోర్ట్స్​ కోటాతో తపాలా శాఖలో ఉద్యోగాలు- రూ80 వేల జీతం! అర్హతలు ఏంటంటే?

ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు- రూ90వేల జీతం! అప్లై చేసుకోండిలా

ABOUT THE AUTHOR

...view details