Kerala school digital attendance system: కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అధునాతన హాజరు విధానం అమల్లోకి వచ్చింది. పాలక్కడ జిల్లా చిత్తూరులోని సర్కారీ బడి విద్యార్థులే ఈ స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం విశేషం. పిల్లలంతా బయోమెట్రిక్ యంత్రంలో రోజూ ఉదయం, సాయంత్రం వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ ఆటోమెటిక్‌గా సర్వర్‌లో నిక్షిప్తమవుతాయి. విద్యార్థులు బడికి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తిరిగెళ్లారు అనే సమాచారం తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది.
విద్యార్థుల స్టార్టప్: ప్రభుత్వ పాఠశాల కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ ఈ స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, గణితశాస్త్రం, ఇంజినీరింగ్ రంగాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో 2018లో అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరిట ఈ అంకుర సంస్థ ఏర్పాటైంది. ఆసక్తి ఉన్న 5 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఇందులో భాగస్వాములు.