కేరళ మలప్పురంలోని పన్తళ్లూర్లోని ఓ హైస్కూల్‌కు చెందిన అష్రఫ్ అనే పదో తరగతి విద్యార్థి.. తన 'మానసిక వైకల్యం' కారణంగా పాఠశాలలో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోయాడు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ప్రోత్సహించేందుకు తన టీచర్లు అతనికి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అలా ట్రాక్ మొత్తం సంతోషంగా పరుగులుతీసిన అష్రఫ్ ఆఖరికి ఫినిష్ లైన్‌కు చేరుకున్నాడు. తన కృషికి మెచ్చిన స్కూల్ యాజమాన్యం అతనికి మెడల్‌తో పాటు బొకే ఇచ్చి సత్కరించింది.
కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టి మంగళవారం దీనికి సంబంధిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ స్కూల్ యాజమాన్యాన్ని కొనియాడారు. అష్రఫ్ విజయంలో పాలు పంచుకున్న తోటి విద్యార్థులతో పాటు స్కూల్ టీచర్లను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.