రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే.. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీతో కలిసి పోటీచేయనుంది. డీఎండీకేకు 60 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు ఏఎంఎంకే పార్టీ తెలిపింది. అమ్మ నిజమైన సంక్షేమ ప్రభుత్వం కోసం కృషి చేయాలని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అన్నారు.
ఏఎంఎంకేతో కలిసి బరిలోకి విజయకాంత్ పార్టీ - tamilnadu polls
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. రానున్న ఎన్నికల్లో ఏఎంఎంకే పార్టీతో కలిసి పోటీచేయనుంది విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే. డీఎండీకేకు 60 అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు ఏఎంఎంకే పార్టీ తెలిపింది.
ఏఎంఎంకేతో కలిసి బరిలోకి విజయకాంత్ పార్టీ
సీట్ల పంపకాల్లో అభిప్రాయభేదాల కారణంగా అన్నాడీంకే- భాజపా కూటమి నుంచి విజయకాంత్ అధినాయకత్వంలోని డీఎండీకే పార్టీ తప్పుకుంది.
ఇదీ చదవండి :'దేశాన్ని విభజించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు'