Food for Gaganyaan astronauts: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చెపట్టిన ప్రాజెక్ట్ 'గగన్‌యాన్'. ఇందుకోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వ్యోమగాములకు అన్ని విధాలుగా శిక్షణనిస్తున్నారు. తాజాగా.. వ్యోమగాములు సేవించే ఆహారపదార్థాల తయారీ ప్రారంభమైంది.
కర్ణాటక మైసూర్‌లోని డీఆర్డీఓకు చెందిన డీఎఫ్ఆర్ఎల్(డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లెబోరేటరీ) ఈ ఫుడ్‌ను తయారు చేస్తోంది. ఈ సందర్భంగా.. డీఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్త మధుకర్.. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"భూమి మీద అయితే కూర్చుని, నిల్చుని మనం భోజనం చేసేందుకు వీలు ఉంటుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ మన చపాతీలు, కూరలు అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. అందువల్ల వ్యోమగాములకు ప్రత్యేక ఆహారం రూపొందించాల్సి ఉంటుంది. దానిపై మేము పనిచేస్తున్నాము. ఆహారపదార్థాల జాబితాను సిద్ధం చేసి.. వాటిని పరీక్షిస్తున్నాము. గగన్‌యాన్‌లో రోదసిలోకి వెళుతున్న ముగ్గురు వ్యోమగాములు భారతీయులే. అందువల్ల భారతీయ వంటకాలనే ఎంపిక చేశాము. రెడీ టు ఈట్ వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నాము. వ్యోమగాములకు ఆహారాన్ని అందించేందుకు ఓ లిక్విడ్ డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాము. క్రిములు ప్రవేశించలేని ప్రపంచస్థాయి వంటశాల మన దగ్గర ఉంది. ఇక్కడే ఫుడ్ తయారు చేస్తాము. అంతరిక్షంలోకి వెళ్లాక.. వ్యోమగాములు వాటిని తినొచ్చు. ముందు.. వీటిని ఇస్రోకు పంపిస్తాము. అక్కడి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌తో.. ఆహారపదార్థాల తుది జాబితాను సిద్ధం చేస్తాము."
--- మధుకర్, డీఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్త.
స్పేస్ ఫుడ్ మెన్యూ ఇదే..