తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆమెను నాతో మాట్లాడమని చెప్పు దేవుడా'.. శివుడికి రోజూ భక్తుడి లేఖ!

'ప్రతి రోజు నాకు సరిపడా ఆదాయం ఇవ్వు, ఆ అమ్మాయిని రోజులో ఎక్కువసార్లు నాతో మాట్లాడమని చెప్పు దేవుడా'.. శివుడికి ఓ అజ్ఞాత భక్తుడి లేఖ ఇది. ఒక్కసారి కాదండోయ్​. ఆ ముక్కంటికి ప్రతిరోజు తన సమస్యలు చెప్పుకుంటూ లేఖలు రాస్తున్నాడు.

Devotee writes letter to Lord Shiva
శివుడికి అజ్ఞాత భక్తుడి లేఖలు

By

Published : Oct 6, 2021, 7:48 PM IST

దేవుడికి ఓ లేఖలో తమ సమస్యను రాసి.. గుడిలోని ఓ చెట్టుకు కడితే తీర్చుతాడని మల్లన్న సినిమాలో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే తమిళనాడు మధురైలోని కల్యాణ సుందరేశ్వర ఆలయంలో నిత్యం జరుగుతోంది. అయితే.. ఇక్కడ ఒకే భక్తుడు రోజూ ఆ శివుడికి లేఖ రాయటం గమనార్హం.

శివుడికి రాస్తున్నట్లు ప్రతిరోజు వెంకటేశ్​ అనే వ్యక్తి పేరుతో ఉత్తరం వస్తోందని ఆలయ అధికారులు తెలిపారు. అయితే.. అతని పేరు తప్ప.. చిరునామా​, ఇతర వివరాలు ఏమీ లేవని చెప్పారు. అక్టోబర్​ 5న వచ్చిన లేఖలో.. మొదటి పేజీలో ' ప్రతి రోజు నాకు సరిపడా ఆదాయం ఇవ్వు', ' మధురై​కి చెందిన అనూష అనే అమ్మాయిని నాతో రోజులో ఎక్కువసార్లు మాట్లాడమని చెప్పు దేవుడా' అని రాశాడు.

వెంకటేశ్​ పేరుతో వచ్చిన లేఖలు

ఆ అజ్ఞాత భక్తుడి వివరాలు ఏమీ లేకపోవటం, రోజూ ఒక లేఖ రావటంపై ఆలయ అధికారులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పూజారులు

ABOUT THE AUTHOR

...view details