మహారాష్ట్ర, పుణెలోని ప్రసిద్ధ దగ్దుశేత్ హాల్వాయ్ గణపతి స్వామికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. 10 కేజీల బంగారు కిరీటాన్ని ఆలయ సన్నిధిలో సమర్పించాడు. ఆ కిరీటంపై విలువైన రాళ్లను కూడా పొదిగించి తయారు చేయించాడు.
ఈ కిరీటం విలువ దాదాపు రూ. 6కోట్లు ఉంటుందని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. భక్తుడు సమర్పించిన ఈ కిరీటాన్ని గణేశ్ ఉత్సవ్ మొదటి రోజున అలంకరించినట్లు తెలిపారు.